TEJA NEWS

పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,ఆర్థికవేత్త , న్యాయకోవిందుడు, రాజనీతిజ్ఞుడు, అంటరానితనం, వివక్షల పై అలుపెరుగని పోరాటం చేసిన ధీశాలి, భారత రాజ్యంగ నిర్మాత ,భారత రత్న శ్రీ. డా. బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పెట్ లో గల . డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పూలమల వేసి ఘనంగా నివాళ్లు అర్పించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ మాట్లడుతూ డా. బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి శుభాకాంక్షలు తెలిపి, అదేవిదంగా డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాసిన పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగా ఉంది అని సమ సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన కృషి ఎనలేనిది.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాటలోనే పయనించాలని, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ,భారత రత్న డాక్టర్ అంబేద్కర్ దేశం కోసం ఎంతో కృషి చేశారని, రాజ్యాంగం రాసి నవ భారత నిర్మాణ అధ్యడు అని, ,ఈ రోజు సంక్షేమ పథకాలు ప్రతి పేద ప్రజలకు అందుతున్నావంటే అది బి ర్ అంబెడ్కర్  మనకు కలిపించిన హక్కు అని ,దేశ విదేశాలు తిరిగి రాజ్యాంగాని రచించిన మేధావి ,ఆయన ఆశయాలను ,ముందుకు తీసుకుపోయి భవిష్యత్తు తరాలకు తెలియచెయ్యాల్సిందిగా మనఅందరి బాధ్యత అని ఆయన ఆశయాలను సాధిద్దాం అని, అందుకు ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం ,స్ఫూర్తిదాయకం అని, ఆయన చూపిన బాటలో యువత పయనించాలని నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. మనం ఎంచుకున్న మార్గం వెంట ఎలాంటి జంకు లేకుండా ముందుకు సాగిపోవాలనేదే భారత రాజ్యాంగ నిర్మాత, సమ సమాజ స్థాపన ఆలోచన ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయమని, ప్రయాణం మొదలుపెడితే లక్ష్య సాధన వరకు వెనుక అడుగు వేయనీయదని అంబేద్కర్ బోధించాడు, ఆ మహనీయుడు చూపిన బాటలోనే ఈరోజు భారతదేశ వ్యవస్థలు నిర్మాణం కావడం దేశ ప్రజలందరికీ గర్వకారణం అని వ్యాఖ్యానించారు. ఇదొక్క మనకే పరిమితం కాలేదు.. ఇతర దేశాలు సైతం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకోవడం నిజంగా మనందరికీ గొప్పతనం అని వివరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కనబరిచిన దార్శనికతతోనే దళిత గిరిజన బహుజన వర్గాలతోపాటు సకల జనులందరికీ ఆర్థిక, సామాజిక న్యాయం, అన్ని రంగాల్లో సమాన న్యాయం అమల్లోకి వచ్చిందన్నారు. ఆయన కృషి ఒక్కటని ఏం చెప్పగలం.. వారికి మనం ఎంత చేసినా తక్కువేనని, ఆయన అత్యున్నత ఆశయాలను అనుసరించేందుకు నిత్యం స్పూర్తి పొందాలని , ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ స్ఫూర్తితో అక్షర బాట పట్టాలని, చదువును ఆయుధంగా మలుచుకొని ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని, అప్పుడే ఆ మహనీయుడి ఆశయాలకు సార్థకత అవుతుంది అన్నారు. అలా మనం ఎదిగినప్పుడే అంబేడ్కర్ కు మన నిజమైన నివాళి అర్పించినట్టని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.