
స్థానిక పత్తిపాటి పుల్లారావు గార్డెన్స్ లో జరిగిన ప్రజా దర్బార్ లో గత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన అవినీతిపై ఫిర్యాదు
ప్రజా దర్బారులో గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మాజీ pఎమ్మెల్యే విడుదల రజిని మరియు విడుదల గోపి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ముగ్గురు ఆధ్వర్యంలో జరిగిన ఏడు కోట్ల రూపాయల అవినీతిపై స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు సమక్షంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకు కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. జరిగిన అవినీతి గురించి ఉదాహరణగా చీరాల రోడ్డు పస్మరు గ్రామ సర్వే నెంబరు 753/e మరియు 753/ఫ్రెండ్స్ లు లో అనధికార లేఔట్ లో 16 బిల్డింగులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఉదాహరణ ఒక మచ్చుతునక మాత్రమే ఎమ్మెల్యే విడుదల రజిని విడుదల గోపి ఆధ్వర్యంలో ఎన్నో అవినీతి అక్రమాలు పాల్పడటం కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేయడం జరిగింది. సదరు పై విషయాలన్నీ పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబుకి మల్లెల శివ నాగేశ్వరావు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం అందుకున్న కలెక్టర్ అరుణ్ బాబు మున్సిపల్ కమిషనర్ ని ఎంక్వైరీ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు
