Spread the love

పట్టాలు ఇచ్చిన
రెండు పడకల గృహాల్లో అసలైన లబ్ధిదారులు లేనివి గుర్తించి నోటీసులు జారీచేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి


వనపర్తి జిల్లా
ఇప్పటి వరకు పట్టాలు ఇచ్చిన రెండు పడకల గృహాల్లో అసలైన లబ్ధిదారులు నివాసం లేనివి గుర్తించి నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
కలక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్ కార్యనిర్వహక ఇంజనీరు, గృహ నిర్మాణ శాఖ పి.డి, సంబంధిత తహశీల్దార్లతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పై సమీక్ష నిర్వహించారు.
ఇటీవల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించగా వాటిలో ఎవరైతే పట్టాలు పొందారో అట్టి లబ్ధిదారులు నివాసం ఉండటం లేదనే విషయం గుర్తించడం జరిగిందన్నారు. జిల్లాలో 1488 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి 543 మందికి నిరుపేద కుటుంబాలుగా గుర్తించి లక్కీ డీప్ ద్వారా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. మరికొన్ని రోడ్డు విస్తీర్ణంలో ఇళ్ళు, దుకాణాలు కోల్పోయిన వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చిన ఇళ్లలో అసలు పట్టాదారులు నివాసం ఉండకుండా అద్దెకు ఇవ్వడం మరికొన్ని ఖాళీగా పడి ఉన్నట్లు తెలిసిందన్నారు.


నిబంధనల ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అద్దెకు గాని, లీజ్ కు లేదా అమ్ముకోడానికి వీలు లేదని,
అందువల్ల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాల జాబితా, ఇటీవల కుటుంబ సర్వే లో ఉన్న ఇంటి నెంబర్ల జాబితాను పరిశీలించి సంబంధిత తహశీల్దార్లు తమ వెంట ఇంజనీరింగ్, పోలీస్ సిబ్బందిని వెంట తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించాలని ఆదేశించారు. ఖాళీ ఉన్న వాటిని ప్రభుత్వ అధీనంలోకి తీసుకొని అద్దెకు ఉన్న వారికి ఫారం 2, అసలు పట్టాదారు కు ఫారం 1 ద్వారా నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా ఎక్కడైతే 90 శాతానికి పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్నారో ఎలాంటి కాలనికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఎంకావాలో నివేదిక సిద్ధం చేసి ఇవ్వాలని సూచించారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్ కార్యనిర్వహక ఇంజనీరు మల్లయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, పి.డి. హాజింగ్, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.