
ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేసి క్రిమినల్ కేసులను నమోదు చేయాలని…..జిల్లా విద్యాశాఖ అధికారి సూపరడెంట్కు వినతి పత్రం అందజేసిన…… పిడిఎస్ యు
వనపర్తి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యజమాన్యాలు ముందస్తు అడ్మిషన్లు చేసుకుంటూ పోస్టర్లు కరపత్రాలు ఫ్లెక్సీలు కొట్టించుకుని ప్రచారాలు చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులను మభ్యపెడుతూ ప్రవేట్ పాఠశాల ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లను ఇంటింటికి పంపిస్తూ అడ్మిషన్లు చేసుకుని వేల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను తుంగలో తొక్కి ప్రైవేట్ కార్పొరేటర్ పాఠశాలను ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వారి పాఠశాలలో పనిచేసే టీచర్లను కూలీలుగా మారుస్తున్నారు వారి పాఠశాలలను వ్యాపారంగా కొనసాగిస్తున్నారు. పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు వెంకటేష్ ఆరోపిస్తూ ఇప్పటినుండే బుక్స్, టై, బెల్టు, షూ పేర్లతో విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి వేల రూపాయలు తీసుకుని డోర్ టు డోర్ అందిస్తున్నారు.కాబట్టి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారి స్పందించి వీటిపై అరికట్టేందుకు పత్రిక ప్రకటన ద్వారా ప్రకటన ఇచ్చి ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న పాఠశాలలపై గుర్తింపు రద్దుచేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(PDSU) పి డి ఎస్ యు డిమాండ్ చేశారు లేనియెడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ చారికి అందజేసిన వినతిపత్రంలో హెచ్చరించారు . ఈ కార్యక్రమంలోపిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు బి వెంకటేష్ నాయకులు అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
