
కార్మికుల రక్తతర్పణంతో ఏర్పడిందే ఎర్రజెండా
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా 139 మే డే
మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలనికార్మికులకు పిలుపు
వనపర్తి
1886 లో చికాగో నగరంలో తమ హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులపై పోలీసులు జరిపిన కాల్పులలో 8 మంది కార్మికులు అమరులయ్యారని వారి రక్తతర్పణ తోనే ఎర్ర జండా పురుడు పోసుకుందని ఆ సంఘటనకు గుర్తుగానే నాటి నుండి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు ఏకమై జరుపుకునే ఒకే ఒక పండుగ మేడే అని ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షులు శ్రీహరి జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ లు పేర్కొన్నారు గురువారం 139 వ మేడే ను పరిష్కరించుకొని జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రభుత్వఆసుపత్రి, మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి ఇందిరా పార్క్ చౌరస్తా మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్ కిరణ్మయి ఏఐటియుసి జెండాను ఆవిష్కరించి మే డే ను ఘనంగా నిర్వహించారు అనంతరం ఏఐటీయూసీ నాయకులు శ్రీహరి గోపాలకృష్ణ లు మాట్లాడుతూ కార్మికులు పోరాడి తెచ్చుకున్న 8 గంటల పని విధానాన్ని అలాగే 29 కార్మిక చట్టాలను నేడు కేంద్ర ప్రభుత్వం వాటిని నాలుగు లేబర్ కోడులుగా మార్చి కార్మికుల మెడలకు ఉరితాలుగా జెసి అమలు చేస్తుందని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు అలాగే కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఇతర హక్కుల కోసం మే 20న దేశవ్యాప్త తలపెట్టిన సార్వత్రిక సమ్మెను కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు కార్మికులు పోరాటాలతోని అనేక సమస్యలు పరిష్కారించుకున్నారని అలా తెచ్చుకున్నవే 29 కార్మిక చట్టాలని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వరుణ్ నరసింహ శాంతన్న రాముడు కళావతమ్మ కృష్ణ కురుమయ్య రాంబాబు తదితరులు పాల్గొన్నారు
