TEJA NEWS

సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకం

  • ప్రజాస్వామ్యానికి పునాది
  • విలువలతో కూడిన జర్నలిజం
  • ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట ప్ర‌త్తిపాటి ప్ర‌శంస‌లు

చిల‌క‌లూరిపేట‌:స‌మాజంలో జ‌ర్న‌లిస్టుల బాధ్య‌త కీల‌క‌మ‌ని, విధి నిర్వ‌హ‌ణ‌లో ఎద‌ర‌య్యే స‌వాళ్ల‌ను ఎదుర్కొంటూనే సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో జ‌ర్న‌లిస్టులు భాగ‌స్వాములు కావ‌డం అభినంద‌నీయ‌మ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావు అన్నారు. ఇటీవ‌ల ఉగాది సంద‌ర్బంగా జిల్లా క‌లెక్ట‌ర్ పి అరుణ్‌కుమార్, ఎంపీ లావు శ్రీ కృష్ణ‌దేవ‌రాయ‌లు, న‌ర‌స‌రావుపేట ఎమ్మెల్యే డాక్ట‌ర్ చ‌ద‌ల‌వాడ అర‌వింద‌బాబు చేతుల మీదుగా ఏపీయూడ‌బ్ల్యూజే ఎగ్జిక్యూటివ్ మెంబర్ ,ప్రెస్ క్ల‌బ్ చిల‌క‌లూరిపేట అధ్య‌క్షుడు, జిల్లా కార్య‌వ‌ర్గ స‌భ్యుడు అడ‌పా అశోక్‌కుమార్‌, కార్య‌ద‌ర్శి షేక్ ద‌రియావ‌లిలు ఉత్త‌మ సేవా పుర‌స్కారాన్ని అందుకున్నారు. స‌మాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావు త‌న నివాసంలో పుర‌స్కారం అందుకున్న అడ‌పా అశోక్‌కుమార్‌,షేక్ ద‌రియావ‌లిని శాలువ‌ల‌తో స‌త్కరించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌త్తిపాటి మాట్లాడుతూ సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు.
జ‌ర్న‌లిజం ఒక‌ సామాజిక బాధ్య‌త‌..


సమాజంలో ప్రగతి, చైతన్యానికి పునాది సమాచారమేన‌ని, ఈ సమాచారాన్ని సమయానుసారంగా, నిష్పక్షపాతంగా ప్రజలకు అందించడం జర్నలిస్టులది ప్రధాన బాధ్యత అని చెప్పారు. జ‌ర్న‌లిస్టులు కేవలం వార్తల సేక‌ర‌ణ‌కే పరిమితం కాకుండా సామాజిక సేవలోనూ అసాధారణమైన పాత్ర పోషించ‌టం అభినంద‌నీయ‌మ‌న్నారు. సుస్థిర ప్రజాస్వామ్యంలో నాలుగు మూలస్థంభాల్లో మీడియా ఒకటని, జర్నలిస్టులు నిబద్ధతతో వ్యవహరించినప్పుడే ప్ర‌జాస్వామ్యం ప‌రిఢ‌విల్లుతుందని వెల్ల‌డించారు. గ‌తంలో విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ప్రెస్‌క్ల‌బ్ ద్వారా ఆహారాన్ని అందించే కార్య‌క్ర‌మానికి తానే ప్రారంభించాన‌ని గుర్తు చేశారు. జర్నలిజం అంటే ఒక సామాజిక బాధ్యత అని, ప్రగతిశీల సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల సేవలు, నిబద్ధత, నైతిక విలువలు భ‌విష్య‌త్తు తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కొనియాడారు. కూట‌మి ప్ర‌భుత్వం జ‌ర్న‌లిస్టు సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ , తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరీ సదాశివరావు , రూరల్ మండల అధ్యక్షులు జవ్వాజి మదన్మోహన్ యడ్లపాడు మండల పార్టీ అధ్యక్షుడు కామినేని సాయిబాబా,పట్టణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మురుకొండ మల్లిబాబు, ఎడ్లపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు ముక్త వాసు, రాష్ట్ర రైతు నాయకులు నాగపూర్ణ చంద్రరావు, 19వ వార్డు కౌన్సిలర్ నసీమా బేగం తదితరులు పాల్గొన్నారు.