Spread the love

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఆలయాల పాత్ర ఎంతో ముఖ్యమైనది – ఎమ్మెల్యే కె.పి.వివేకానంద..

125 గాజులరామారం డివిజన్‌ పరిధిలోని ఇంద్రానగర్-A, నిర్వహించిన పోచమ్మ దేవాలయం 9వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఆలయాల పాత్ర ఎంతో ముఖ్యమైనది అని పేర్కొన్నారు. భక్తుల శ్రద్ధా భక్తులతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆలయ మహిమాన్వితతను ప్రతిబింబిస్తోందని ఆయన ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, 127 డివిజన్ అధ్యక్షులు అరువ శంకరయ్య, బసవరాజు, చిన్న చౌదరి, మహేష్, సంక్షేమ సంఘం నాయకులు బద్రి, రమేష్, శ్రీనివాస్, కుమార్, భాను, సుధాకర్, మరియు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..