
రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరి ఉత్తర్వులు పంపిణీ చేసిన
ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్
వేములవాడ పట్టణంలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరి ఉత్తర్వులు జిల్లా కలెక్టర్ తో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ పట్టణం లో రెండో విడత కింద 484 లబ్ధిదారులను పారదర్శకంగా అర్హులుగా ఎంపిక చేసి నేడు ఉత్తర్వులు పంపిణీ చేస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు.
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని నిర్మాణం పూర్తైన తర్వాత లక్ష రూపాయల, గోడలు నిర్మిస్తే లక్ష రూపాయలు, స్లాబ్ నిర్మించిన తరువాత 2లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని ఎమ్మెల్యే * తెలిపారు .
ప్రభుత్వం అందించే సహాయం గురించి ఏ అధికారి లేదా దళారి నుంచి పైరవి వంటి చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు . ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని, ఎవరికి ఒక రూపాయి ఇవ్వడానికి వీలు లేదని
