TEJA NEWS

పేదోడి ప్రగతి రధ చక్రం ప్రారంభం…. _

నిజాంపేట్ నిజాంపేట్, బాచుపల్లి డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాల వద్ద ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించిన నిజాం పేట్ కార్పొరేషన్ పరిధి మాజీ డిప్యూటీ మేయర్ శెనిగల ధన్ రాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ బాలాజీ నాయక్….

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్, బాచుపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాల వద్ద నుంచి వేవ్ రాక్ కు నూతనంగా ఏర్పాటు చేసిన రెండు ఆర్టిసి బస్సులను నిజాం పేట్ కార్పొరేషన్ పరిధి మాజీ డిప్యూటీ మేయర్ శెనిగల ధన్ రాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ బాలాజీ నాయక్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….పేదవాడి ప్రయాణ నేస్తం ఆర్టీసీ అని, మౌలిక వసతుల కల్పనలో భాగంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోని నిరుపేద విద్యార్థులు, లబ్ధిదారులు నగరంలోని సుదూర ప్రాంతాలను చేరుకునేందుకు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆర్టీసీ అధికారులతో సమావేశమై నియోజకవర్గంలోని అన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాల వద్దకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని, అందులో భాగంగానే నేడు నిజాంపేట్, బాచుపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాల వద్ద నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏర్పాటుచేసి ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మా సమస్యను తెలుసుకొని ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారికి స్థానిక ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాల లబ్ధిదారులు తలారి రాము, గోపాల్ నాయక్, సలీం, జావిద్, రామ్ రెడ్డి, విద్యా మోహన్, లక్ష్మి,జ్యోతి, కృష్ణవేణి,అజయ్ షా, భరత్ మహేష్, కాంతారెడ్డి,స్వామి శంకర్ నాయక్,రాజు,స్వరూప నందు తదితరులు పాల్గొన్నారు.