Spread the love

చేవెళ్ల నియోజకవర్గం:- పెళ్లిళ్ల వయసులో ఉన్న మహిళలకు రాష్ట్రప్రభుత్వం చేయూత:- చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” .

చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు “కాలే యాదయ్య” చేవెళ్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో చేవెళ్ల మండలానికి చెందిన లబ్దిదారులకు మంజూరైన Rs.81,09,396/- (రూపాయలు ఎనభైఒకటిలక్షల తొమ్మిదివేల మూడువందలతొంభైఆరు) విలువ గల 81 కళ్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

అనంతరం చేవెళ్ల మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన Rs.29,79,000/- (రూపాయలు ఇరవైతొమ్మిదిలక్షల డెబ్బైతొమ్మిదివేలు) విలువ గల 62 ముఖ్యమంత్రి సహాయనిది (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.