
ముచ్చర్లపల్లి గ్రామంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట
నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండల పరిధి ముచ్చర్లపల్లి గ్రామంలో చౌడేశ్వరి అమ్మవారు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి బీజేవైఎం నాయకులు శ్రీకాంత్ మరియు గ్రామ ప్రజలు ఆహ్వాన మేరకు ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు వాగుల దాస్ నిరంజన్ గౌడ్ పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్య ప్రదం, ఇక్కడికి రావడం కూడా నాకు చాలా సంతోషకరంగా ఉంది, ఈ చౌడేశ్వరి అమ్మవారు ప్రతి ఏటా వచ్చే భక్తులను కోరిన కోరికలను కొంగుబంగారంగా చేసి గ్రామ ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని ఆయన అన్నారు, అదే విధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ కల్వకుర్తి బిజెపి మాజీ మండల అధ్యక్షుడు సురేందర్ గౌడ్ బి జె వై ఎం తెలంగాణ నాయకులు రాజశేఖర్ దివాకర్ గౌడ్ అరవింద్ గౌడ్ . తాడెం.చిన్న బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
