
వరిగడ్డి ట్రాక్టర్ ఢీ.. మహాత్మా గాంధీ విగ్రహం రోడ్డు పైకి…
చిలకలూరిపేట పట్టణంలో గడియార స్తంభం సెంటర్ వద్ద రోడ్డు మధ్యలో మహాత్మా గాంధీ విగ్రహంని వరి గడ్డి ట్రాక్టర్ తగలటం వలన మహాత్మా గాంధీ విగ్రహం కింద పడిపోయినది అని అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. రోడ్డుపై పడిన విగ్రహాన్ని తిరిగి మరల దిమ్మె వద్ద చేర్చారు. స్థానికులు ఆ వాహనం వెంటపడి ఆపడానికి ప్రయత్నం చేసిన అతను ఆగలేదు.ఇకనైనా అధికారులు చర్యలు తీసుకొని రహదారిపై విగ్రహాలను రక్షణ కల్పించాలని,పడిపోయిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని యధా స్థితిలో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.
