TEJA NEWS

రైతు వద్ద ఉన్న మిగులు ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి…. నాదెండ్ల మనోహర్ కి వినతిపత్రం అందజేసి అభ్యర్థించిన ఎమ్మెల్యే “బత్తుల”….

అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతుల నుండి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అభ్యర్థన..

వెంటనే స్పందించి MLA కి శుభవార్త తెలియజేసిన మంత్రి

రాజానగరం నియోజకవర్గంలో గల రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల పరిధి గ్రామాల్లో ధాన్యం పండించిన రైతుల వద్ద నుండి ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసిందని, అలానే ఇంకా మిగులు ధాన్యం రైతుల వద్ద నుండి వెంటనే కొనుగోలు చేయాలని….. రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖమాత్యులు నాదెండ్ల మనోహర్ ని కాకినాడలో మర్యాదపూర్వకంగా కలిసి, వినతిపత్రం అందజేసి రైతులు వద్దనున్న మిగులు ధాన్యం వెంటనే కొనుగోలు చేసి, అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులకు భరోసా కల్పించాలని అభ్యర్థించడం జరిగింది….

దానికి వెంటనే స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో వరి పండించిన రైతు వద్ద నుండి ప్రతి గింజ, ఆఖరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని/ కొనుగోలు చేసి వాళ్లకు పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని/తక్షణమే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది…

మంత్రిగారిని ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసిన మిగిలి ఉన్న ధాన్యం గల గ్రామాలు….

::సీతానగరం మండలం::

  1. పురుషోత్తపట్నం 100 మెట్రిక్ టన్నులు
  2. నాగంపల్లి 580 మెట్రిక్ టన్నులు
  3. మిత్తిపాడు 80 మెట్రిక్ టన్నులు
  4. రఘుదేవపురం 3,,, 120 మెట్రిక్ టన్నులు
  5. చిన్న కొండెపూడి 600 మెట్రిక్ టన్నులు
  6. ముగ్గళ్ళ 250 మెట్రిక్ టన్నులు
  7. వంగలపూడి 300 మెట్రిక్ టన్నులు
  8. సింగవరం 450 మెట్రిక్ టన్నులు
  9. రఘుదేవపురం,,1 500 మెట్రిక్ టన్నులు
  10. కాటవరం 300 మెట్రిక్ టన్నులు

::కోరుకొండ మండలం::

  1. జంబుపట్నం 50 మెట్రిక్ టన్నులు
  2. మునగాల 140 మెట్రిక్ టన్నులు
  3. రాఘవపురం 50 మెట్రిక్ టన్నులు
  4. కోటికేశవరం 50 మెట్రిక్ టన్నులు
  5. దోసకాయలపల్లి 50 మెట్రిక్ టన్నులు
  6. బుల్లెద్దుల పాలెం 510 మెట్రిక్ టన్నులు
  7. కోటి 100 మెట్రిక్ టన్నులు
  8. నరసాపురం 50 మెట్రిక్ టన్నులు
  9. శ్రీరంగపట్నం 100 మెట్రిక్ టన్నులు
  10. మధురపూడి 50 మెట్రిక్ టన్నులు
  11. బూరుగుపూడి 50 మెట్రిక్ టన్నులు
  12. నిడిగట్ల 50 మెట్రిక్ టన్నులు

:: రాజానగరం మండలం::

  1. సంపత్ నగరం 250 మెట్రిక్ టన్నులు
  2. ఎర్రంపాలెం 300 మెట్రిక్ టన్నులు
  3. ముక్కినాడ 100 మెట్రిక్ టన్నులు
  4. తోకాడ 2,,, 100 మెట్రిక్ టన్నులు
  5. నందరాడ 150 మెట్రిక్ టన్నులు
  6. నరేంద్రపురం 50 మెట్రిక్ టన్నులు