Spread the love

నంద్యాల నియోజకవర్గంలో రెప రెప లాడినా తెలుగుదేశం జెండా

ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

నంద్యాల టీడీపీ కార్యాలయంలో జెండా ను ఆవిష్కరించిన మంత్రి ఫరూక్ , యువ నాయకులు ఫయాజ్

నంద్యాల …. టీడీపీ 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నంద్యాల నియోజకవర్గ వ్యాప్తంగా ఊరు వాడలా టీడీపీ జెండా రెప రెప లాడింది. ఈ సందర్భంగా స్థానిక శ్రీనివాస్ సెంటర్ ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ , టిడిపి రాష్ట్ర యువనాయకులు ఎన్ఎండి ఫయాజ్ మరియు టిడిపి బృందం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు .. అనంతరం నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జెండా ఆవిష్కరించడం జరిగింది

ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు 1982 మార్చి 29 న తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ఒక ప్రభంజనం సృష్టించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. కుల మతాలకతీతంగా పార్టీని స్థాపించి ఏర్పాటుచేసిన తొమ్మిది నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీని మట్టి కల్పించిన ప్రాంతీయ పార్టీ టిడిపి అని పేర్కొన్నారు. అటు రాజకీయ రంగంలోనే కాకుండా సినీ రంగంలో రాముడిగా , కృష్ణుడిగా వెంకటేశ్వరడిగా , రాజకుమారుడిగా వివిధ పాత్రల్లో అగ్ర కథానాయకుడిగా ప్రజల్లో తగిన గుర్తింపు తెచ్చుకున్న యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు అన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే పేదలు కడుపునిండా మూడు పూటలా అన్నం తినాలనే ఉద్దేశ్యంతో కి.లో రూ.2 లకే బియ్యం పథకాన్ని తీసుకొచ్చారు అదేవిధంగా పేదలు నూతన వస్త్రాలు ధరించాలని ఆలోచనతో జనతాదోవ పథకాన్ని , సొంత ఇల్లు పేదలకు ఉండాలని ఆలోచనతో ఎన్టీఆర్ పక్కా గృహాన్ని తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి రామారావు అన్నారు. అంతేకాకుండా అన్న నందమూరి తారక రామారావు అమలు చేసిన సంక్షేమ పథకాలె దేశానికి మార్గదర్శక నిలుస్తున్నాయని గుర్తు చేశారు రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ తో పాటు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావుకు దక్కుతుందని గుర్తు చేశారు. రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.

టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలన ఎలా ఉంది ప్రస్తుత పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థమై ఉంటుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో రాష్ట్ర అభివృద్ధి తోపాటు ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు గత ఐదేళ్ల వైసిపి పాలనలో కనీసం గుంతల పడిన రోడ్లకు గంపెడు మన్ను కూడా వేయలేదని గుర్తు చేశారు ఈ కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల కిలోమీటర్ల గుంతలమయమైన రోడ్లను పునర్నిర్మించుకున్నామని తెలిపారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు పోలవరం జీవనాడి అని తెలిపారు. దేశంలో 29 రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు గా భావించి పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు అన్న నందమూరి తారక రామారావు ఆనాడు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే నిదర్శనం అన్నారు ఆయన ఆశయ సాధన కోసం మనమంతా పాటుపడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శులు జిల్లెల్ల శ్రీరాములు , ఎవిఆర్ ప్రసాద్ , నంద్యాల మార్కెట్ యాడ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మరియు కౌన్సిలర్లు , మాజీ కౌన్సిలర్లు , గ్రామ , వార్డు టిడిపి ఇన్చార్జిలు , తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు , అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు