
తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ.
మైలవరంలో టీడీపీ సంస్థాగత ఎన్నికల ప్రత్యేక సమావేశం.
పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు .
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,
తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుదామని, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజాసేవలో పునరంకింతం అవుదామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పిలుపునిచ్చారు.
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ సంస్థాగత ఎన్నికలను మే 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మైలవరం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు సారథ్యంలో టీడీపీ సంస్థాగత ఎన్నికలను పురస్కరించుకుని ప్రత్యేకంగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.
మైలవరం పట్టణంలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో టీడీపీ నాయకులు, కుటుంబ సభ్యులతో బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి కనీస అవసరాలు అయిన కూడు, గుడ్డ, నీడ అందించాలనే దృఢమైన సంకల్పంతో అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని అన్నారు. అన్న ఆశయాలు, సిద్దాంతాలకు అనుగుణంగా టీడీపీని సీఎం చంద్రబాబు , టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ , టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ముందుకు నడిపిస్తున్నారన్నారు.
అధినేత సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం తెలుగుదేశం పార్టీలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్తగా కుటుంబ సాధికార సారథులను నియమిస్తున్నట్లు వెల్లడించారు.
సంస్థాగత ఎన్నికల నిర్వహణకు పక్కా కార్యాచరణ రూపొందించి, నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పూర్తయ్యేలా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి 60 మంది ఓటర్లకు ఇద్దరు కుటుంబ సాధికార సారథులను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో పార్టీలో తొలిసారిగా ఈ ప్రయోగం చేపట్టారన్నారు.
మే 27 నుంచి మూడ్రోజులపాటు కడపలో మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో మే 15 నాటికి అన్ని నియోజకవర్గ, పార్లమెంటరీ స్థాయిలో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు స్పష్టంచేశారు. టీడీపీ కుటుంబ సభ్యులంతా ఐకమత్యంగా పార్టీ సారథులను ఎన్నుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
