Spread the love

ముస్లింలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది -MLA బొండా ఉమ

సాయంత్రం సెంట్రల్ నియోజకవర్గం లోని అరండల్ పేట మసీద్ -ఇ-బిలాల్ మసీదు నందు పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని, ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ ఇందులో పాల్గొన్న ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు …

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-పేద ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఈ పవిత్ర రంజాన్ మాసంలో, పేదలను పైకి తీసుకొచ్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈనెల 30న పీ-4 అమలు చేయనున్నట్టు, మార్గదర్శి-బంగారు కుటుంబం పేరుతో ఈ కార్యక్రమం మొదలు పెట్టి ప్రతి ముస్లిం కుటుంబాన్ని, పేద వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొని రావటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టు…

జీవో నెంబర్ 43 తెచ్చి వక్ఫ్ బోర్డుని వివాదాల్లోకి నెట్టేసింది గత వైసీపీ ప్రభుత్వం అని, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఆ జీవో రద్దు చేసి ముస్లింల సంక్షేమానికి అన్ని చర్యలూ తీసుకుంటునట్టు, ముస్లింల సంక్షేమానికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.5300 కోట్లు కేటాయించి, గత ప్రభుత్వ బడ్జెట్లో ముస్లిం సంక్షేమానికి ఇచ్చిన నిధుల కంటే రూ.1300 కోట్లు ఎక్కువ అందించాం అని…

రాష్ట్రానికి, నియోజకవర్గ ప్రజలకు అంతా మంచి జరగాలని ముస్లిం సోదరులతో కలిసి అల్లాను బొండా ఉమగారు ప్రార్థించారు…

ఈ కార్యక్రమంలో:-మసీద్ -ఇ-బిలాల్ మసీదు అధ్యక్షులు SK బాషా, సెక్రటరీ అబ్దుల్ రజాక్, ట్రెజరర్ MD రిజ్వన్, అబ్దుల్ రషీద్, లాల్ అహ్మద్, రహీం తుల్లాఖాన్, MD సలీం తదితరులు పాల్గొన్నారు….