
రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే యూజీసీ నూతన సంస్కరణలను వ్యతిరేకించండి- పిడి ఎస్ యు పిలుపు
— మార్చి 26 పాలమూరు యూనివర్సిటీ సదస్సు పోస్టల్ విడుదల
వనపర్తి
కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నూతన సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీలలో గవర్నర్ల ద్వారా నేరుగా విసీల నియామకాలను చేపట్టడం అంటే యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి హక్కులను కాలరాయడమేనని దీని పూర్తిగా వ్యతిరేకించేందుకు ఉద్యమించాలని (PDSU ) పి డి ఎస్ యు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు కందుకూరి పవన్ కుమార్ . గెలుపునిచ్చారు సోమవారం పిడిఎస్ యు( PDSU) వనపర్తి జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో యు జి సి నూతన సంస్కరణలకు వ్యతిరేకంగా తేదీ. మార్చి 26 పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించే సదస్సు కు సంబంధించిన గోడపత్రికలను వనపర్తి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఆయన ఆవిష్కరించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 90 శాతం మంది పేద వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులు ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారని యు జి సి నూతన సంస్కరణల వలన ఉన్నత విద్యను వీరికి దూరం చేయనున్నాయని అన్నారు.
ప్రభుత్వ యూనివర్సిటీలకు యూజీసీ అభివృద్ధి నిధులు ఫెలోషిప్ లో వివిధ రీసెర్చ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి విద్యార్థులకు తోడ్పాటు అందించేదని కానీ గత పది ఏళ్ల బిజెపి పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఫెలోషిప్ల కోత పెట్టిందని యూనివర్సిటీల అభివృద్ధికి బడ్జెట్ను కేటాయించకుండా పేద దళిత గిరిజన వర్గాల విద్యార్థులను యూనివర్సిటీ క్యాంపస్ లోకి రాకుండా అడ్డుకుంటుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు( PDSU) ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి సాయి కృష్ణ కమిటీ సభ్యులు రాకేష్,ప్రవీణ్ బీచ్ పల్లి, రాఘవేంద్ర నరేష్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి, ఆంజనేయులు,కార్తీక్ దాసరం నాయక్ తోపాటు విద్యార్థులు పాల్గొన్నారు
