
లేబర్ కోడ్ ల రద్దుకై
మే 20న సార్వత్రిక సమ్మెకు*తెలంగాణప్రభుత్వ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిద్ధం………
.(ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి..పి.సురేష్
వనపర్తి
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై, కార్మిక వర్గానికి ఉరితాళ్లుగా మారిన నాలుగు లేబర్ కోడ్ ల రద్దుకై మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పాలన వ్యవస్థను స్తంభింప చేస్తామని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ అన్నారు.బుధవారం వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాల కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా మే 20న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వాల్ పోస్టర్స్ కరపత్రాలు ఆవిష్కరించారు. కార్మికులకు ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్టు యూనియన్ సభ్యత్వ గుర్తింపు కార్డులను కార్మికులకు అందజేశారు.
ఈ సందర్భంగా పి. సురేష్ మాట్లాడుతూ:-కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గంపై వేతన జీవులపై సామాన్య ప్రజల జీవన స్థితిగతులను విధ్వంసం చేసే విధంగా ఆధునిక సంస్కరణల పేరుతో దొడ్డి దారిన వినాశనకర చట్టాలకు జీవోలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. కార్మిక వర్గం అనేక త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాల నుంచి దాదాపు 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకొచ్చారని దీనితో కార్మిక వర్గం చట్టబద్ధ హక్కులు సర్వం కోల్పోయి శ్రమ దోపిడీకి,ఆర్థిక పీడనకు బలైపోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఉద్యోగుల ప్రజల జీవన సగటు ఆదాయం పెంచకుండా పెట్రోలు డీజీలు వంటగ్యాస్ లాంటి నిత్యవసర వస్తువుల ధరలు జిఎస్టి పన్నులు మాత్రం ఇష్టానుసారంగా పెంచుతున్నారని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం తీర్పును అమలు చేయకుండా, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు సవరణలు చేయకుండా మోసం చేస్తుందని అన్నారు. ఈనెల 20న దేశవ్యాప్తంగా కోటానుకోట్ల కార్మిక వర్గం ప్రజలు సమ్మెతో వీధుల్లోకి వస్తున్నారని కనుక అన్ని వర్గాల ప్రజలు సమ్మెలో భాగస్వామ్యం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) మెడికల్ కళాశాల బ్రాంచ్ నేతలు కార్మికులు వరుణ్, కుమార్,శేఖర్, సైదా బేగం,భారతి,మన్నెమ్మ, లక్ష్మి రాజేశ్వరి శివలీల అంజనమ్మ, శ్రీగంగ, లక్ష్మమ్మ,పీరమ్మ భారతి,దేవమ్మ, శోభ,సుధ,రమ్య, శారద, జయలక్ష్మి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
