TEJA NEWS

మహిళ అనుమానస్పద మృతి

  • హత్యనా. ..ఆత్మహత్యనా

నాగర్ కర్నూల్ కల్వకుర్తి పట్టణంలోని కేఎల్ఐ కాల్వలో పడి మహిళ మృతి చెందిన ఘటన కల్వకుర్తి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని మార్చాల గ్రామానికి చెందిన ప్రభావతి (40) ఉదయం పంజుగుల గ్రామ రోడ్డులోని కేఎల్ఐ కాల్వలో శవమై కనిపించడంతో చుట్టుపక్కల స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతికి గల కారణాలు ఆరా తీయగా మృతురాలు ప్రభావతి తాగుడుకి బానిసై పలుమార్లు ఇంటి బయటకి వెళ్ళిపోయి మళ్ళీవచ్చేదని, అదే విధంగా సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అర్ధరాత్రి వరకు రాకపోవడంతో కుటుంబీకులు వెతికిన ఆచూకీ దొరకలేదు. కేఎల్ఐ కాల్వలో శవమై కనిపించింది. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు. భర్త ఓ సర్కారు పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది. మద్యం సేవించి కల్వకుర్తి నుంచి కేఎల్ఐ కాల్వ వద్దకు దాదాపు 2కిలో మీటర్ల దూరం ఉంటుంది. మృతురాలిని ఎవరైనా తీసుకెళ్లి చంపి కాల్వలోకి నెట్టారా… లేక ఆత్మహత్య చేసుకుందా…? అనే వివరాలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం జరిగాక మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.