
సంఘం అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
పేట్ బషీరాబాద్ లోని క్యాంప్ కార్యాలయంలో “దళిత సంఘాల ఐక్యవేదిక -307” నూతన కార్యవర్గం సభ్యులు ముఖ్య సలహాదారులు కిషన్ రావు, గట్టు అశోక్, మజ్జల సత్యనారాయణ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. దళిత సంఘాల ఐక్యవేదిక నూతన కార్యవర్గం సభ్యులకు ముందుగా అభినందనలు. నా గెలుపులో కీలక పాత్ర పోషించి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన దళిత సంఘాల ఐక్యవేదిక సభ్యులందరికీ నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు మంగ రాంచందర్, ప్రధాన కార్యదర్శి మేకల ఎల్లయ్య, కోశాధికారి జి.జే.రత్నం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, ఎం.సాయిబాబా, గౌరవాధ్యక్షులు సిహెచ్.బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
