
గణపవరం లో భారీ చోరీ
దేవాలయాలను టార్గెట్ చేసిన దొంగలు
5 లక్షలు విలువైన సొత్తు ఎత్తుకెళ్లిన దుండగులు
గణపవరం లోని రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణు గోపాల స్వామి దేవాలయం లో దొంగలు హల్ చల్ చేశారు
గ్రిల్స్ తాళాలు పగలకొట్టి విగ్రహాలు కి అలంకరించిన మూడు వెండి కిరిటాలు,చంకు చక్రాలు,24గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు
హుండీ పగలకొట్టి హుండీ లోని నగదు దోచుకెళ్లారు
మొత్తం సొత్తు 5 లక్షల రూపాయలు ఉంటాయని గ్రామస్తులు పోలీసులు కుతెలిపారు
ఘటన స్థలాన్ని నాదెండ్ల పోలీసులు పరిశీలించారు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
