
సిసి రోడ్లు నిర్మాణం చేసిన తిమ్మంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు..
భద్రాద్రి కొత్తగూడెం
అశ్వరావుపేట నియోజకవర్గం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండల పరిధిలోని తిమ్మంపేట పంచాయతీలో గ్రామ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వర్లు అధ్యక్షన తిమ్మంపేట పాత బజార్లో సిసి రోడ్లకు భూమి పూజ చేసిన ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ మాట్లాడుతూ మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మన రాష్ట్ర మంత్రులు బట్టి విక్రమార్కు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు మరియు అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ సారధ్యంలోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని ఇందిరమ్మ ఇల్లు అలాగే సిసి రోడ్లు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రతి పల్లెను పట్టణం మాదిరిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు.
ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయని ప్రతిపక్షాలు చేసే కల్లబోలు మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు కోండ్రు రవి,అశ్వరావుపేట నియోజకవర్గ యూత్ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి సుమీత్, ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సోయం నాగరాజు, మడకం కిరణ్, కటికనేని ఆదిత్య, పుప్పాల సునీల్, రాయల వెంకటేష్, పుప్పాల ఆకాష్, తదితరులు పాల్గొన్నారు.
