
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చౌక దారుల దుకాణంలో పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రమంతా శ్రీకారం చుడుతున్న సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి సూచనల మేరకు నియోజకవర్గం లోని 128 డివిజన్ అధ్యక్షులు పండరి రావు ఆధ్వర్యంలో చింతల్ లోని ఓల్డ్ చింతల్, భగత్ సింగ్ నగర్, వల్లభాయ్ పటేల్ నగర్ చౌక దారుల దుకాణలలో పేద ప్రజల కోసం సన్న బియ్యం కార్యక్రమం ప్రారంభించి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండి శ్యామ్ గౌడ్, బల్ రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, బాబు, కమల, లక్ష్మి పాల్గొన్నారు.
