Spread the love

ఇది రీ సర్వే కాదు: మంత్రి పొన్నం

TG: రాష్ట్రంలో మళ్లీ సర్వే చేస్తారనే ప్రచారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ‘ఇప్పటికే పకడ్బందీగా సర్వే చేశాం. ఇది రీ సర్వే కాదు. కేవలం మిసైన వారి కోసం మాత్రమే. సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదు. బీజేపీకి రిజర్వేషన్లు ఇష్టం లేదు. రిజర్వేషన్ల విషయంలో వ్యతిరేకమని కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన పార్టీ బీజేపీ. సర్వే తర్వాతనే ఎన్నికలు జరుగుతాయి.’ అని చెప్పుకొచ్చారు.