
ఇది పర్యాటకులపై దాడి కాదు భారత్ పై దాడి: ప్రధాని నరేంద్ర మోడీ
హైదరాబాద్:
ఉగ్రవాది ఎక్కడ తల దాచుకున్న సరే వెతికి మరి శిక్షిస్తామని, ప్రధానమంత్రి అన్నారు. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠినంగా శిక్షిస్తామని అన్నారు.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్ లోని మధుబనిలో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో ప్రధాని పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై నేరుగా స్పందించారు. అమాయకులైన ప్రజలను పొట్టనబెట్టుకున్న వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు.
ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంది. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతిఒక్కరిలోనూ బాధ, ఆగ్రహం ఉన్నాయి.
ఈ ఉగ్రదాడి వెనుక ఉన్న వారు.. ఇందులో భాగమైన వారికి ఊహకందని రీతిలో శిక్ష విధిస్తాం. ఉగ్రమూకల వెన్నెముకను 140 కోట్ల మంది భారతీయులు విరిచేస్తారు. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు యావత్ భారత్ దృఢ సంకల్పంతో ఉంది
అమాయకులైన ప్రజలను ఉగ్రవాదులు అతికిరాత కంగా చంపేశారు. ఈ దుర్మార్గమైన దాడులకు తెగబడ్డవారు ఎక్కడున్నా తీసుకొచ్చి మట్టిలో కలిపేసే సమయం వచ్చింది. ముష్కరులు కలలో కూడా ఊహించని విధంగా వారిని శిక్షిస్తాం. ఇది పర్యటకులపై జరిగిన దాడి కాదు… భారత్‌పై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు.
దాడులకు పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించు కుంటారు.అని ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత్‌కు అండగా నిలిచిన విదేశాల కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలియ జేశారు. మానవత్వాన్ని విశ్వసించే ప్రతిఒక్కరూ తమకు అండగా నిలిచారని ప్రధాని పేర్కొన్నారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
