
జైలు కి వెళ్లిన వాళ్ళు కూడా నీతులు చెబుతున్నారు
కవితకు పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించే అర్హత కవితకు లేదు
కవిత వెంటనే పవన్ కళ్యాణ్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలి
చిలకలూరిపేట: ఒకే గూటి పక్షులు ఒకేలా వ్యవహరిస్తాయనటానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై బీఆర్ ఎస్ నాయకురాలు కల్వకుంట కవిత చేసిన వాఖ్యలే నిదర్శనమని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి అన్నారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ జైలు కెళ్లి బెయిల్‌పై వచ్చిన వైసీసీ అధినేత జగన్‌కు, లిక్కర్ స్కామ్‌లో జైలులో ఉండి వచ్చిన కవిత కితాబు ఇవ్వడం వరకు బాగానే ఉందని, ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ మహిళలకు ఇచ్చే గౌరవం రీత్యా కవిత విషయంలో జనసైనికులు సంయమనం పాటిస్తున్నారని వెల్లడించారు. కవిత వెంటనే పవన్‌కళ్యాణ్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కవితకు పవన్ కళ్యాణ్ పేరేత్తే అర్హత లేదు..
జనసేన పార్టీ సుదీర్ఘ ప్రయణంలో సాహసాలు, పోరాటాలు, త్యాగాలతో నిండి ఉందని, ఎన్ని రకాలుగా ఇబ్బందులుకు గురి చేసినా తొలకని, బెదరని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోరాట పటిమ ఇమిడి ఉందని వివరించారు. పవన్ కళ్యాణ్ తాను నమ్మిన ఆశయాన్ని ఆచరిస్తూ, రాజకీయాల్లో నూతన వరవడిని ప్రవేశపెట్టారని, నిత్యం జనసైనికులను క్షమశిక్షణ గలిగిన సైనికుల్లా తయారు చేశారని చెప్పారు. భారతీయ సంస్క్రతి, సాంప్రదాయాలను గౌరవిస్తూ, మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ, జనసైనికులను నడిపిస్తూ దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించారని వెల్లడించారు.జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ దమ్మున రాజకీయ నేత అని, అందుకే తాము నమ్మిన సిద్దాంతాన్ని, ఆశయాలను బహూటంగా చెబుతున్నారని బాలాజి వెల్లడించారు. ప్రజల కోసం, ప్రజల సమస్యల సాధన కోసం అనునిత్యం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కూతురిగా వారసత్వ రాజకీయాలతో నెట్టుకొస్తున్న కవిత.. తండ్రి వారసత్వంలో ప్రజలు తిరస్కరించిన జగన్‌ను పొగుడుతారని, పవన్ కళ్యాణ్ పేరేత్తే అర్హత కూడా కవితకు లేదన్నారు. రాజకీయల్లో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత, నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సేవలో తీరకలేకుండా ఉన్న పవన్‌కళ్యాణ్‌ను విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు.
