
కోదాడ సూర్యాపేట జిల్లా)
పేదవారి ఆకలి తీర్చే సన్నబియ్యం పంపిణి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
కోదాడ శాసన సభ్యురాలు
నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి
ఉగాది పర్వదినాన పేదల ఆకలి తీర్చే సన్నబియ్యం పంపిణి కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లపై కోదాడలో ఎమ్మెల్యే ఇంట్లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హుజూర్ నగర్ నుండి రాష్ట్ర ప్రజలకి సన్నబియ్యం పంపిణి అందించటం చాలా సంతోషం అని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ కి మంత్రిగా బాధ్యత వహించటంతో మంత్రి ఆహానం మేరకు ఉగాది రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ వస్తున్నందున ఎక్కువ మొత్తంలో కార్యకర్తలు హాజరై ముఖ్యమంత్రి కి స్వాగతం పలకాలని తెలిపారు.
గత పది రోజులనుండి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ ఎల్ బి సి పై సమీక్ష నిర్వహిస్తూ,మంత్రిగా అసెంబ్లీ లో సభ్యులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెపుతూ, హుజూర్ నగర్ లో సభ ఏర్పాట్లు చూసుకుంటూ,దేవాదుల ప్రాజెక్ట్ సమావేశాలు నిర్వహిస్తూ ఇలా క్షణం తీరిక లేకుండా రాష్ట్ర ప్రజల అభివృద్ధి,సంక్షేమం కోసం నిరంతరం కష్టపడుతున్నారని మన నాయకుడి లాగానే మనం కష్టపడి కోదాడ నియోజకవర్గం నుండి ఎక్కువగా మొత్తంలో కార్యకర్తలు హాజరు కావాలని తెలిపారు.
ఉదయం ఉగాది పండుగ కుటుంబ సభ్యులతో కలిపి జరుపుకొని సాయంత్రానికి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి సభకి హాజరు కావాలని, ముఖ్యంగా మహిళలు పేరు మీదనే సన్నబియ్యం పంపిణి చేయటం జరుగుతుంది కాబట్టి మా మహాలక్ష్మి లు ఎక్కువ హాజరు కావాలని వారికోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న, పి సి సి డెలిగేట్ మెంబర్ చింతల లక్ష్మీనారాయణ రెడ్డి,జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
