
స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవు
హైదరాబాద్:
వేసవి కాలం వచ్చేసింది. మార్చి నెలలోనే ఎండలు దంచేశాయి. ఇప్పుడు ఏప్రిల్ నెల నడుస్తోంది. ఓ వైపు వానలు, మరోవైపు ఎండలు తమ ప్రతాపం చూపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈనెల 24 నుంచే స్కూళ్లకు ప్రభుత్వం సమ్మర్ హాలిడేస్ ప్రకటిం చిన విషయం తెలిసిందే. అంతకుముందే తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. 12, 13, 14 తేదీల్లో సెలవులు ప్రకటించారు.
ఏప్రిల్ 12వ తేదీన రెండో శనివారం.
13వ తేదీన ఆదివారం
14వ తేదీన అంటే సోమవారం అంబేద్కర్ జయంతి
కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులకు వరుసగా 12, 13, 14 వ తేదీల్లో సెలవులు రానున్నాయి.
