
మూడు రోజులు సెలవులు!
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 14, 15,16 తేదీలలో సెలవులు వస్తున్నాయి. 14న షబ్-ఎ-బరాత్ సందర్భంగా ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. అలాగే, 15న సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించాలని బంజారాలు డిమాండ్ చేస్తున్నారు. ఇక 16న ఆదివారం. సాధారణంగా సెలవు ఉంటుంది. దీంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి
