
శ్రీ శ్రీ శ్రీ బాట గంగమ్మ వారి సేవలో తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష.
తిరుమల (పాపవినాశనం సమీపంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ బాట గంగమ్మ జాతర మహోత్సవము ఘనంగా నిర్వహించారు.
తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొని అమ్మవారికి ఉదయం సారె అందజేశారు.అనంతరము అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
తితిదే మాజీ హిందూధర్మ ప్రచార పరిషత్ సభ్యులు పెంచలయ్య, తిరుమల స్థానికులు, ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి దర్శనం ఏర్పాటుచేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
