Spread the love

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరo బడ్జెట్ లో అబివృద్ధి పనుల కేటాయింపులో నియమ నిబంధనలు పాటించాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం : తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య

తిరుపతి, : తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరo బడ్జెట్ లో అబివృద్ధి పనుల కేటాయింపులో నియమ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.

తుడ కార్యాలయం లో నిర్వహించిన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ మొదటి బోర్డు సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య, ఏం.ఏ. అండ్ యుడి ఓ.ఎస్.డి.వెంకట సుబ్బయ్య, ఆర్.డి. శ్రీనివాసులు పాల్గొని పలు అభివృద్ధి పనులపై చర్చించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలో చేపట్టవలసిన అబివృద్ధి పనుల కేటాయింపుల్లో అన్ని నియమ నిబంధనలు పాటించాలని అన్నారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ 2025-2026 వార్షిక బడ్జెట్ లో 611 కోట్లకు ఆమోదం తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరం ఖాతా నివేదికలను ప్రిన్సిపల్ అకౌటెంట్ జనరల్, ఆంధ్రప్రదేశ్ వారిచే ఆడిట్ చేయించేయందుకు, రేణిగుంట మండలం, సూరప్పకశం నందు 145 ఎకరములలో పద్మావతి నగర్‌ లేఔట్‌ నందు సిసి డ్రెయిన్స్‌ నిర్మాణానికి, విద్యుద్దీకరణ పనులు చేయుటకు, మహిళా యూనివర్సిటీ నందు విద్యార్ధుల సౌకర్యార్థం రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపారు. తుడా టవర్స్ నందు నివాసయోగ్యమైన 2,3,4 బెడ్ రూమ్ ప్లాట్స్ ను ఈ-వేలము ద్వారా విక్రయించారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ యందు వాణిజ్య గదులను, 2,3,4 ఫ్లోర్లు నందు కార్యాలయపు గదులను విక్రయం, లీజు కు ఇచ్చుటకు ఆమోదం తెలిపారు. నెల్లూరు-తడ, తడ-శ్రీకాళహస్తి మరియు పుత్తూరు నుండి కడూరు వరకు ఉన్న మూడు ప్రధాన రహదారులకు రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్‌లను, కన్సల్టెన్సీ ద్వారా చేయటానికి, తుడా లో విలీనమైన ప్రాంతాల మాస్టర్ ప్లాన్ తయారీపై టెండర్లను ఆహ్వానించేందుకు, యస్.వి.యూనివర్సిటీ పరిధిలో ఆమోదించిన ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ రోడ్డులను తొలగించుట కొరకు ప్రభుత్వం వారికి ప్రతిపాదనలు పంపుట కొరకు ఆమోదం తెలిసారు. చంద్రగిరి నియోజక వర్గం మామండూరు వద్ద యం.ఐ.జి లేఔట్ ను అభివృద్ధి పరచుటలో సవరణ లేఔట్ ప్లాన్ ను డి.టి.సి.పి వారి ఆమోదము కొరకు పంపేందుకు బోర్డు నిర్ణయిoచారు, రుయా హాస్పిటల్ నందు రోడ్లు అభివృద్ధి పరచుటకు ఆమోదం తెలిపారు.

తుడా ఉపాధ్యక్షురాలు మౌర్య మాట్లాడుతూ.. తుడా నిధులతో ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేపడదామని తెలిపారు.

ఈ బోర్డు సమావేశంలో తుడా ఇంచార్జి సెక్రెటరీ కృష్ణా రెడ్డి, ఈ.ఈ. రవీంద్ర, పి. ఓ.దేవి కుమారి, తదితరులు పాల్గొన్నారు.


డి ఐ పి ఆర్ ఓ, తిరుపతి