TEJA NEWS

మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలి.
*రోగులకు అందుబాటులో వైద్య సేవలు.
*ముఖ్యఅతిథిగా పాల్గొన్న శంకర్
( శ్రీకాకుళం )

  • రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా ఆసుపత్రి యాజమాన్యాలు అందించే దిశగా చర్య చేపట్టాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు.శ్రీకాకుళం నియోజకవర్గం పట్టణం స్థానిక ఆర్ట్స్ కళాశాల వాటర్ ట్యాంక్ దగ్గర శాంతి నగర్ కాలనీ లో ఉషోదయ క్లినిక్ ఆర్థోపెడిక్ & డెంటల్ కేర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గోండు శంకర్ గారు శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో అత్యవసర వైద్యo కోసం విశాఖపట్నం విజయవాడ తదితర ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సి వచ్చేదని, కానీ నేడు శ్రీకాకుళంలో కూడా కార్పొరేట్ స్థాయి అత్యవసర వైద్య సేవలు అందుతుండడం సుఖ పరిణామం అని చెప్పారు. జిల్లాలో ఎందరో స్పెషలిస్ట్ వైద్యులు తమ వైద్య సేవలను ప్రజలకు అందిస్తూ వారిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందుబాటులో ఉంచడంతోపాటు పేదలకు అవసరమైన వైద్యాన్ని తక్కువ ధరలకే అందించాలని సూచించారు. వైద్యో నారాయణ హరి అంటారని అంటే వైద్యుడు దేవుడితో సమానం అని పురాణాలు చెబుతాయని అటువంటి వైద్యులు రోగులను ప్రేమిస్తూ వారికి వైద్య సదుపాయాలు అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. భవిష్యత్తులో జిల్లాలో మరిన్ని మల్టీస్ స్పెషలిస్ట్ ఆసుపత్రిలో నెలకొల్పే ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లో PAC అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్ గారు ప్రముఖ వైద్యులు కింజరాపు అమ్మన్ నాయుడు గారు,గొండు గంగాధర్ గారు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసునాయుడు గారు, నాయకులు, యువత, కార్యకర్తలు పాల్గొన్నారు*