
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణము పెద్ద ఎత్తున నిర్మించుటకు చర్యలు తీసుకొనుటకు
- డ్వామా అధికారులకు సూచించిన ఎమ్మెల్యే శంకర్
(శ్రీకాకుళం)
గ్రామీణ ప్రాంతాల్లో గోశాలలు మరియు పశువుల నీటి తొట్టెలు నిర్మాణానికి మెరుగుపరిచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ సూచించారు. కలెక్టరేట్ లో ఎమ్మెల్యే శంకర్ డ్వామా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలు తీసుకోమని కోరడమైనది
వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయడం, మట్టిని కాపాడటం, భూగర్భ జలాలను పునరుద్ధరించాలని చెప్పారు. నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం, నీటి దుర్వినియోగాన్ని తగ్గించడం, నీటి నిర్వహణను పర్యవేక్షించడం, నదుల నీటి ప్రవాహాన్ని నియంత్రించడం, కాలుష్యం నివారణ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పిడి డ్యూమా మరియు ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
