
అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం కలెక్టర్లకు
జిల్లా రిజిస్ట్రార్ విచారణ నివేదికమేరకు చర్యలు
వెంటనే అమల్లోకి వచ్చేలా నోటిఫికేషన్ జారీ
ఆస్తుల రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగితే.. వాటిని రద్దుచేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి దఖలు పరుస్తూ కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. 2023 మార్చిలో చట్టసభల ద్వారా ఆమోదం పొందిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించ డంతో జారీచేసిన ఈ నోటిఫికేషన్ బుధ వారం నుంచి అమల్లోకి వచ్చిందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి జయలక్ష్మి వెల్ల డించారు. సివిల్ కోర్టులకు మినహా అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్లు రద్దుచేసే అధికారం ప్రస్తుతం ఎవరికీ లేదు. దీనివల్ల ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఇతర అక్రమ పద్ధతుల్లో అక్రమ పద్ధతుల్లో ఆసుల విక్రయాలరిజిస్ట్రేషన్లకు అడ్డుపడడం లేదు. ఈ నేపథ్యంలో అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ల నిరో ధానికి జాతీయ రిజిస్ట్రేషన్ చట్టం-1908ను సవరించిన (ఏపీ యాక్ట్ ఎమెండ్ మెంట్-2023) బిల్లుకు 2023 మార్చి 20న శాసనసభ ఆమోదం తెలిపింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీని అమలు ఉత్తర్వులు ఇప్పుడు వెలువడ్డాయి.
కమిటీ పరిశీలన
రిజిస్ట్రేషన్లు అక్రమ పద్ధతుల్లో జరిగినట్లు ఫిర్యాదులు అందగానే జిల్లా రిజి స్ట్రార్ వాటిని పరిశీలిస్తారు. ఆధారాల ప్రాతిపదికన కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడే కమిటీకి సిఫార్సు చేస్తారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా రిజిస్ట్రార్, ఇతర అధికారులు ఉంటారు. నిషిద్ధ జాబితా నుంచి విడిపించిన 13 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ (ఎసైన్డ్) భూముల్లో 25వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో ఆక్రమాలు జరిగినవి 7వేల ఎకరాల వరకు ఉన్నాయి. తాజా ఉత్తర్వులతో ఇలాంటి రిజిస్ట్రేషన్లను రద్దుచేయడం సులువవుతుంది.
సబ్-రిజిస్ట్రార్లకు మూడేళ్ల జైలు
నిషిద్ధ జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు చేసినా, ఒకే ఆస్తికి రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేసినా, కోర్టు ఎటాచ్మెంట్లో ఉన్నవాటికి రిజిస్ట్రే షన్లు చేసినా.. అలాంటి సబ్-రిజిస్ట్రార్లకు మూడేళ్ల వరకు జైలుశిక్ష విధి స్తారు. ఈ మేరకు సవరించిన చట్టంలో పేర్కొన్నారు. విధినిర్వహణలో సబ్-రిజిస్ట్రార్ వ్యవహరించిన తీరు వల్ల క్రయ, విక్రయదారులకు నష్టం వాటిల్లి నట్లు రుజువైతే ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించవచ్చని ఇప్పటికే అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ చట్టంలో పేర్కొన్నారు.
బ్రాండెడ్ కంపెనీలతో ఒప్పందాలపై స్టాంప్ట్యూటీ వసూలు
బ్రాండెడ్ కంపెనీలతో వ్యాపారం చేసేందుకు కంపెనీలు లేదా వ్యక్తులు చేసు కునే ఒప్పందాల (ప్రాంఛైజ్) విలువ అనుసరించి స్టాంపుడ్యూటీ వసూలు అమలు నోటిఫికేషన్ ను రెవెన్యూ శాఖ బుధవారం జారీచేసింది. ఈ నోటిఫికే షన్ అనుసరించి తీసుకునే చర్యలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో రెవెన్యూశాఖ పేర్కొంది. ఒప్పంద కాలపరిమితి ఏడాది వరకు ఉంటే రూ.1,000, పదేళ్లలోపు ఉంటే ఏడాదికి రూ.1,000 చొప్పున స్టాంపుడ్యూటీ చెల్లించాలి. పదేళ్లు దాటితే రూ.25,000 వరకు స్టాంపుడ్యూటీ వసూలుచేస్తారు.
