
మున్సిపల్ చైర్మన్ రఫానీని అభినందించిన పట్టణ ప్రముఖులు
చిలకలూరిపేట:ఈనెల 3,4 తేదీలలో హర్యానా రాష్ట్రంలో జరగిన నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ లో మున్సిపాలిటీలలో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి, మెరుగైన సేవలు అనే అంశంపై రెండు రోజుల సదస్సులో పలు అంశాలను ప్రస్తావించి, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన స్థానిక ప్రభుత్వాల ప్రతినిధుల ముందు లోతైన చర్చకు అవకాశం కల్పించిన మున్సిపల్ చైర్మన్ ని పలువురు అభినందించారు. అంతేకాకుండా చిలకలూరిపేట పట్టణ పౌరుల అభిప్రాయాలను ఆ వేదిక ద్వారా దేశవ్యాప్త చర్చకు అవకాశం కల్పించడం పట్ల అందెల శౌరి, మాదాసు భాను ప్రసాద్, అచ్చు కోల మురళీకృష్ణ, తన్నీరు శ్రీనివాసరావు లుహర్షం వ్యక్తం చేశారు.
ఓవైపు అభివృద్ధి చెందిన దేశాలలోని ప్రజలు, నూతన ఆలోచన విధానంతో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంటే కొందరు చాదస్తం తోటి పౌరుల ప్రశాంత జీవితానికి భంగం వాటిల్లేలా వేడుకలలో 200 పైగా డెసిబల్స్ డిజె సౌండ్ సిస్టంతోప్రజలప్రాణాలతోచెలగాడమాడుతున్నారని ఇది మారాలి అని వారు అభిప్రాయo వ్యక్తం చేశారు.
