TEJA NEWS

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్ నాయకులతో సన్న బియ్యం , ధాన్యం సేకరణ అంశాలపై ఏర్పాటు చేసినటువంటి జూమ్ మీటింగ్ లో పాల్గొనడం జరిగినది.

పిసిసి అధ్యక్షులు మరియు మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయే సన్నబియ్యము మరియు వరి ధాన్యానికి క్వింటాకు బోనస్ గా 500 రూపాయలు ఇవ్వడం , అదేవిధంగా సన్న బియ్యం గురించి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ప్రజలలోకి వెళ్లి వాళ్ళ అభిప్రాయంలో తెలుసుకుంటూ వాళ్లకి అందుబాటులో ఉండాలని తెలియజేయడం జరిగినది. పెద్దలు ఇచ్చిన సూచనల ప్రకారం ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకు వెళ్తూ, ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతామని తెలియజేసిన …..టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి