TEJA NEWS

సంప్రదాయిని ..సుప్పిని ..సుద్ద పూసని….అనుకుంటే పొరపాటే…..బొట్టు పెట్టుకుని ఫ్యామిలీ లేడీలా ఉంది కదా.. కానీ గాంజాయి లేడి

మహిళలు.. చదువుల్లో, కొలువుల్లో పురుషులతో పోటీ పడటం సంతోషదాయకం.

కానీ సమాజానికి చేటు చేసే అసాంఘిక కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది.

పైన ఉన్న ఫోటోలో ఉన్న మహిళ ఎంత పద్దతిగా, ఫ్యామిలీ విమెన్‌గా కనిపిస్తుంది కదా..!

కానీ తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో గంజాయితో పట్టుబడింది.

అది కూడా హై క్వాలిటీ హైబ్రీడ్ గంజాయి.

కేరళలోని కోయంబత్తూర్‌కు సమీపంలో ఉన్న నేదుంబస్సేరి విమానాశ్రయంలో హైబ్రిడ్ గంజాయితో ఒక మహిళ అరెస్టు అయింది.

ఎయిర్‌పోర్ట్ బ్యాగుతో కనిపించిన ఆమె.. కాస్త భిన్నంగా ప్రవర్తిస్తూ ఉండటంతో అధికారులు అదుపులోకి తీసుకుని చెక్ చేశారు.

తనిఖీల్లో ఆ మహిళ వద్ద ఉన్న బ్యాగులో 1.190 కిలోగ్రాముల హైబ్రిడ్ గంజాయి లభ్యమైంది.

మహిళను తమిళనాడుకు చెందిన తులసిగా గుర్తించి.. అధికారులు అదుపులోకి తీసుకున్నారు

పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్‌లో దాదాపు రూ.35 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆమె పెడ్లర్ మాత్రమేనా… లేదా పెద్ద నెట్ వర్క్‌లో భాగమయ్యారా..? గతంలో ఎన్నిసార్లు ఇలా గంజాయి అక్రమ రవాణా చేశారు వంటి కోణాల్లో పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.