
సిమెంట్ ఫ్యాక్టరీల ప్రభావిత గ్రామాల్లో అధికార బృందం పర్యటన
పల్నాడు జిల్లా:
దాచేపల్లి మండలం , పెదగార్లపాడు గ్రామంలో ఉన్న చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ , తంగెడ
గ్రామంలో ఉన్న భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల స్థానిక ప్రజలు , రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించారు.
తాజాగా ఆ గ్రామాల్లోకి వెళ్లి అక్కడ జరుగుతున్న సంఘటనలను పరిశీలించారు. ముందుగా జిల్లా ఉన్నతాధికారుల బృందం ఫ్యాక్టరీ పక్కనే ఉన్న పొలాలపై దుమ్ము పడటంతో ఆ పంట పొలాలని పరిశీలించారు. అనంతరం అక్కడ ఫ్యాక్టరీ మైనింగ్ వల్ల బీటలు వారిన ఇళ్లను కూడా పరిశీలించారు. అనంతరం ఫ్యాక్టరీ లోపల అనుమతులు లేకుండా కట్టిన కట్టడాలను పరిశీలించి , నివేదికను సిద్ధం చేశారు. ఫ్యాక్టరీ సమీపంలో గల 32ఎకరాల
ఎండోన్ మెంట్ భూములను వారు పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఫ్యాక్టరీ వల్ల పడుతున్న ఇబ్బందులు పై స్థానికుల దగ్గర్నుంచి వినతి పత్రాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ మురళి మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న రైతులు మొత్తం గతంలో జిల్లా కలెక్టర్ కు సమస్యలపై విన్నవించుకున్నారని , అదేవిధంగా ఫ్యాక్టరీ దుమ్ము , దూళి వల్ల ఇబ్బంది పడుతున్నారంటూ వచ్చిన కథనాలపై నేడు జిల్లా యంత్రాంగం మొత్తము గ్రామంలో పర్యటించి నివేదికను తయారు చేశామని , ఇందులో భాగంగానే ఇక్కడ దెబ్బతిన్న నివాసాలను పరిశీలించామని అన్నారు. ఈ నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు మరియు రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు.
