
త్రిశక్తి రూపిణీ “వాసవి కన్యకా పరమేశ్వరి” అమ్మవారు: బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
వాసవి కన్యకా పరమేశ్వరి ఈరోజు జయంతి పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. త్రిశక్తి స్వరూపిణీ అయిన శ్రీ వాసవీ కన్యాకా పరమేశ్వరీ జననం ధర్మం, అహింస, సత్యం మరియు స్త్రీ గౌరవానికి ప్రతీక, అమ్మవారి కృపా కటాక్షలతో ప్రజలంతా సంతోషంగా, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలి.
గోదావరి హోమ్స్ నందు…
132 – జీడిమెట్ల డివిజన్ గోదావరి హోమ్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు మాధవ రెడ్డి, రమాచార్యులు, నిర్వాహకులు బిక్షపతి గుప్తా, యోగేష్ గుప్తా, శ్రీనివాస్ గుప్తా, వెంకటేశం గుప్తా తదితరులు ఈ వేడుకలను నిర్వహించారు
సుభాష్ నగర్ లో….
130 – సుభాష్ నగర్ డివిజన్ సుభాష్ నగర్ లో నిర్వహించిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకల్లో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ పాల్గొని అమ్మవారి ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ జయ ప్రకాశ్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ శంకర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఆర్.సంతోష్ కుమార్ గుప్తా, జాయింట్ సెక్రటరీ వి.శ్రీనివాస్ రావు గుప్తా, ట్రెజరర్ అశోక్ కుమార్ గుప్తా తదితరులు ఈ వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు బల్ రామ్ రెడ్డి, గుబ్బాల లక్ష్మీనారాయణ, దుర్గ రావు, శ్రీనివాస్ రాజు, దుబాయ్ శ్రీను, శేషు, శేషాచారి, వెంకటాద్రి నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షురాలు లక్ష్మీ, బిఆర్ఎస్ జీడిమెట్ల డివిజన్ సమన్వయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
