Spread the love

పామూరు దారపనేని క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఇరిగినేని కి నివాళులు అర్పించిన దారపనేని

కనిగిరి
కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలోని కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ క్యాంప్ ఆఫీసులో బ
కీర్తిశేషులు కనిగిరి మాజీ శాసనసభ్యులు ఇరిగినేని తిరుపతి నాయుడు 8వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దారపనేని మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక వ్యక్తి ఇరిగినేని అని, రాజకీయాలలో మచ్చలేని నాయకుడిగా, మకుటం లేని మహారాజుగా పేరు ప్రఖ్యాతులుగాంచిన ఇరిగినేని జీవితం ఈనాటి రాజకీయ నాయకులకు ఆదర్శం అన్నారు. పామూరు మాజీ సర్పంచ్ కావిటి వెంకటసుబ్బయ్య, టిన్ఎస్ వి జిల్లా మాజీ కార్యదర్శి పోక నాయుడు బాబు, నుచ్చు పొద ఫిషర్మెంట్ కమిటీ మాజీ అధ్యక్షులు కౌలూరి ఖాజా రహమతుల్లా, పామూరు మండల మాజీ కోఆప్షన్ సభ్యులు ఖాదర్ మొహిద్దిన్, దారపనేని నరసింహనాయుడు, మానం వెంగళరావు, నూతంగి నారాయణ, జాజం హరికృష్ణ నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.