
సమ్మెకు మద్దతుగా టీటీడీ ఉద్యోగుల నిరసన
** టీటీడీ ఏడీ బిల్డింగ్ ముందు సమ్మె
తిరుపతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయ్యాలని కోరుతూ దేశావ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా తిరుపతి లోని టీటీడీ ఉద్యోగులు నిరసనల్లో పాల్గొన్నారు. ఇందులో సీఐటీయూ అనుబంధంగా నడుస్తున్న టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి గోల్కొండ వెంకటేశం, సంయుక్త కార్యదర్శి కాటా గుణశేఖర్, చెన్నూరు సుబ్రహ్మణ్యం తదితరులు మద్దతుగా పాల్గొన్నారు. గోల్కొండ వెంకటేష్ మాట్లాడుతూ
గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలు యధావిదంగా కొనసాగాలని కోరారు.
పోరాడి సాధించుకున్న 8 గంటల పని స్థానంలో 10, 12 గంటల పనిని ప్రవేశపెట్టాడన్ని వ్యతిరేకస్తున్నాం అని తెలిపారు. మహిళలకు నైట్ షిఫ్ట్ లు, నైట్ డ్యూటీలు అమలు చేయడానికి వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. సీపీఎస్ ను రద్దు చేసి. పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లను వెంటనే ఇవ్వాలన్నారు.
ఉద్యోగుల భాగస్వామ్య ఈహెచ్ఎఫ్ పెండింగ్ లో ఉన్న 180 మందికి మెడికల్ రియంబర్స్ మెంట్ బిల్లు లు వెంటనే ఇవ్వాలని పేర్కొన్నారు. ఈహెచ్ఎఫ్ పరిధిలోకి తిరుపతిలో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ చేర్చాలన్నారు. టీటీడీ ఉద్యోగులకు పాదిరేడు వద్ద ఇచ్చిన ఇంటి స్థలాలను వెంటనే అభివృద్ధి చేసి ఇవ్వాలని తెలిపారు. దాని అభివృద్ధికి అయ్యే ఖర్చు 75 శాతం టిటిడి రాయితీ ఇవ్వాలని కోరారు. టీటీడీ ఉద్యోగ కుటుంబ సభ్యులకు శ్రీవారి దర్శనం రూ.300లు టిక్కెట్ విత్ పేమెంట్ తో నెలకు 10 చొప్పున ఇవ్వాలన్నారు. మరణించిన టిటిడి ఉద్యోగ పిల్లలకు కారణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని కోరారు.
ఆఫీస్ సబార్డినేట్స్ గతంలో 1500 మందికి పైగా ఉండేవారని… ప్రస్తుతం 800 కు చేరుకుని పని భారం విపరీతంగా ఉందని, పని భారానికి తగిన విధంగా సబార్డినేట్లను నియమించాలని సూచించారు. వివిధ విభాగాలలో ఉన్న 4వ తరగతి ఉద్యోగులకు ఆఫీస్ సబార్డినేట్లుగా కన్వర్షన్ వెంటనే ఇవ్వాలన్నారు.
పీలిగ్రిం అలవెన్స్ రూ.2500 నుండి రూ-5 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. హిల్ అలవెన్స్ కూడా రూ.400 వందల నుండి రూ.8 వందలకు పెంచాలని కోరారు. టీటీడీ ఉద్యోగ సంఘాల ఎన్నికలను జరిపించాలన్నారు.5సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, సొసైటీ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులందరికీ మినిమం టైం స్కేలు ఇవ్వాలని, సొసైటీలలో పని చేస్తున్న వారికి కార్పొరేషన్ వారితో సమానంగా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ సిఐటియు అనుబంధ సంఘాలు పాల్గొన్నాయి. టీటీడీ ఎస్.డబ్ల్యూ. యు.ఎఫ్
గోల్కొండ వెంకటేశం, గౌరవాధ్యక్షులు,
కాటా గుణశేఖర్, ప్రధాన కార్యదర్శి,
పద్మనాభం, టీటీడీ ఓఎస్ఓ అండ్ దఫెదార్ యూనియన్ అధ్యక్షులు కోనేటి బాలాజీ, ప్రధాన కార్యదర్శి దయాకర్,
ఆర్.వేణుగోపాల్, కోశాధికారి గోపి కుమార్ రెడ్డి, టీటీడీ ఫారెస్ట్ ఎంప్లాయిస్ యూనియన్
సుబ్రహ్మణ్యం అధ్యక్షులు,
రాజశేఖర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి, మధు, లోకనాథం రెడ్డి, టీటీడీ వాటర్ – ఎలక్ట్రికల్ యూనియన్
ధారా రవికుమార్ అధ్యక్షులు,
ముని కిరణ్ కుమార్ జాయింట్ సెక్రటరీ,
శివయ్య వైస్ ప్రెసిడెంట్
కృష్ణమూర్తి కోశాధికారి, టీటీడీ మహిళా ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షురాలు కట్టమంచి ఇందిర, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
