
తుడా ప్లాట్స్ అమ్మకాలు వేగవంతం చేయండి.
ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య
తిరుపతి నగరంలోని అన్నమయ్య కూడలి వద్ద నిర్మిస్తున్న తుడా టవర్స్ అమ్మకాలు వేగవంతం చేయాలని ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. తుడా ప్లాట్స్ అమ్మకాలు తదితర అంశాలపై తుడా కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తుడా టవర్స్ కు వేలం పాట నిర్వహించగా విశేష స్పందన లభించిందని అన్నారు. టవర్స్ నిర్మాణ పనుల్లో ఆలస్యం అవుతోందని పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అందరూ పాల్గొని టవర్స్ అమ్మకాలు వేగవంతం చేయాలని అన్నారు. రానున్న ఫిబ్రవరి లోపు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్సీ కృష్ణారెడ్డి ఈఈ రవీంద్ర మరియు అధికారులు పాల్గొన్నారు.
