రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది

TEJA NEWS

రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది

జూన్, 28న 0-5 సంవత్సరాల ప్రతి శిశువుకు రెండు చుక్కల పోలియో మందు వేయించి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి :
భారత దేశంలో ప్రస్తుతం పోలియో మహమ్మారి లేనప్పటికీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వంటి దేశాల్లో ఇప్పటికీ పోలియో మహమ్మారి ఉన్నందున భారత దేశంలో పోలియో రాకుండా ఉండేందుకు 0-5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్న పిల్లలకు జూన్ 28న పోలియో చుక్కలు వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఇందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా సంక్షేమ శాఖ, విద్యా శాఖలు సమన్వయంతో పనిచేసి వనపర్తి జిల్లాలో 0-5 సంవత్సరాల ప్రతి ఒక చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని అధికారులను ఆదేశించారు. జూన్ 28న ఆదివారం ఉన్నప్పటికి ఏ ఒక్క పిల్లాడు తప్పుకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒకవేళ ఇప్పటికే పిల్లలకు పోలియో చుక్కలు వేయించి ఉన్నప్పటికీ ఆదివారం వేసే పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని కలెక్టర్ వివరించారు.
సోమవారం ప్రజావాణి హాల్లో జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులకు పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతం పై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.
మండల విద్యా అధికారులు, అంగన్వాడీ సూపర్వైజర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసి వనపర్తి జిల్లాలో ప్రతి శిశువుకు పోలియో చుక్కలు వేసి వందశాతం విజయవంతం చేసేవిధంగా విధి విధానాలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.
ప్రతి తల్లితండ్రులు తమ పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించి పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని సూచించారు.’

జులై, 13న నులిపురుగుల నివారణ దినోత్సవం
పల్స్ పోలియోతోపాటు జూలై 13న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. చిన్నపిల్లలు వచ్చే అనీమియా, జీర్ణ వ్యవస్థ సమస్యలు, పిల్లలు శారీరకంగా ఎదగకపోవడం వంటి సమస్యల నుండి విముక్తి కల్పించడానికి నులిపురుగుల నివారణ దినోత్సవం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1-19 సంవత్సరాల బాల బాలికలకు ఆల్బెండజోల్ మాత్రను తినిపించడం జరుగుతుందన్నారు. ఒక సంవత్సరం వయస్సు నుండి కళాశాలలో చదివే పిల్లల వరకు వయస్సు, మోతాదు ను బట్టి మాత్రలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికి ఆల్బెండజోల్ మాత్రలు తినిపించి వనపర్తి జిల్లాను అనీమియా రహిత జిల్లాగా మార్చాలని, అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సాయినాథ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పిల్లలకు అవసరమైనన్ని పోలియో వయోలిన్ లు , ఆల్బెండజోల్ మాత్రలు ఉన్నాయని, జూన్, 28న ప్రతి శిశువుకు పోలియో చుక్కలు వేసే విధంగా పకడ్బందీగా ప్రణాళికలు చేసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా జులై 13న జాతీయ నులిపురుగుల నివారణ రోజున 1-19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు తినిపించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్, డి. ఆర్ ఓ సూర్యప్రకాష్ , జడ్పీ సి ఈ ఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top