Spread the love

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన దారపనేని

కనిగిరి

కనిగిరి నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వేదాలను తస్కరించిన సోమకుడిని మత్స్యవతారంలో విష్ణువు సంహరించి, వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలో కి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయన్నారు. ఉగాది పండుగ అంటే తెలుగువారి పండుగ అని, ఉగాది పచ్చడిని తిని కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు అన్నారు. ఉగాది అంటే యుగానికి ఆరంభం, ఇది కాస్త కాలక్రమేణ ఉగాదిగా మారింది. ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. అంటే ఆ సంవత్సరం పేరుతో ఉగాది పండుగగా మారింది. ఈ ఏడాది అంటే క్రోథి నామ సంవత్సరం మార్చి 29న ముగుస్తుంది. ఆ తరువాత నుండి మార్చి 30 నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం అవుతుందని, పురాణాలు చెబుతున్నాయని దారపనేని పేర్కొన్నారు.