Spread the love

ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు.. ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు

ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి కావాలని జీవితంలో ఎదురైన కష్టాలను ఎదురుకొని ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఉగాది పచ్చడిలో లాగే తీపి, పులుపు, చేదు, వగరులాగా జీవితం సమ్మిళితమైందని… కష్టాలు వచ్చాయని కుంగిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే మార్గం ఖచ్చితంగా ఉండే ఉంటుందని.. దానిని అన్వేషించి ముందుకు సాగాలని అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరారు…