TEJA NEWS

ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మరో చలివేంద్రం ఏర్పాటు..

కుత్బుల్లాపూర్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త,సామాజిక కార్యకర్త, శ్రీలక్ష్మి టెంట్ హౌస్ ప్రొప్రైటర్ ఆవుల ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో, జీడిమెట్ల పోలీసుల సహకారంతో షాపూర్ సర్కిల్లో మరొక చలివేంద్రం ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా ఆవుల ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తను వ్యాపార సామాజిక సేవా రంగంలో ఉంటూ, జీడిమెట్ల ప్రజలకు నిరంతరం ఏదో ఒక సహాయం చేయాలని ఉద్దేశంతో, అనేక అన్నదాన కార్యక్రమాలు, వేసవిలో చలివేంద్రం శిబిరాలు, దాహార్తుల అవసరాలు తీర్చడానికి పెరుగు మజ్జిగ పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నానని, అయితే ఈ కార్యక్రమాలలో తనకు సహకరిస్తున్న జీడిమెట్ల పోలీసు యంత్రాంగం వారికి, స్థానిక నాయకులకు, ఇతర ఇతర సేవ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. అలాగే తను తలపెట్టే ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న స్థానిక పోలీసు సిబ్బందికి, కార్యక్రమానికి హాజరైన సీఐ మల్లేశం, ఏసీపి డీసీపీ లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.