Spread the love

ఎచ్ఎంటి కంపెనీ మేనేజ్మెంట్ తో జరిగిన యూనియన్ ఇంట్రడక్షన్ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల ఎచ్ఎంటి కంపెనీ జిఎం రాజ బాబు, జెజిఎం షాహిన్,ఎచ్ ఆర్ కార్తీక్ తో జరిగిన యూనియన్ ఇంట్రడక్షన్ సమావేశంలో యూనియన్ లీడర్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ యూనియన్ లీడర్స్ తో కలిసి పాల్గొన్నారు..

అనంతరం యూనియన్ లీడర్స్ కార్మికులతో కలిసి ఎచ్ఎంటి కంపెనీని పర్యవేక్షించి.. కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు..

— యూనియన్ లీడర్స్ కార్మికులు కూన శ్రీశైలం గౌడ్ ని శాలువాతో సత్కరించారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…

— కార్మికుల సమస్యలను ఎచ్ఎంటి కంపెనీ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లామన్నారు..

— కార్మికుల సమస్యల పట్ల ఎచ్ఎంటి కంపెనీ మేనేజ్మెంట్ సభ్యులు సానుకూలంగా స్పందించి,కార్మికుల సమస్యలు సత్వరగా పరిష్కారించడానికి హామీ ఇచ్చారని అన్నారు..

— రిటైర్మెంట్ కార్మికుల బకాయిలపై కూడ చర్చించడం జరిగిందని అన్నారు..

ఈ కార్యక్రమంలో యూనియన్ లీడర్ జనరల్ సెక్రెటరీ జి.శ్రీనివాస్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ పి.శ్రీశైలం,చీఫ్ వైస్ ప్రెసిడెంట్ కేశవ్,రతన్ కుమార్,వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నాయక్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఏ.లక్ష్మణ్ జి, జెయింట్ సెక్రెటరీ నరసింహ చారి,ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాంబాబు,ట్రెజరర్ శ్రీహరి తోపాటు తదితరులు పాల్గొన్నారు..