
ఉప్పల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ స్థాయి సన్నాక సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంటు ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి .
బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ పిలుపుమేరకు చలో వరంగల్ బహిరంగ సభ ఉప్పల్ నియోజకవర్గం స్థాయి సన్నాక సమావేశం మల్లాపూర్ డివిజన్ విఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంటు ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గం శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి హాజరైనారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన చలో వరంగల్ బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు అధినేత కేసిఆర్ పిలుపుమేరకు నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు చలో వరంగల్ సభను విజయవంతం చేయాలని వారు దశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో
ఉప్పల్ నియోజకవర్గం అన్ని డివిజన్లో నుండి ఉద్యమ నాయకులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా అధ్యక్షురాలు మహిళ నాయకురాలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
