ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

TEJA NEWS

ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెలుగు వీరన్న

మోతె: మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెలుగు వీరన్న ఆధ్వర్యంలో కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం చిన్నారులకు పండ్లు పంపిణీ చేసి సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సేవలో ఉత్తమ్ పద్మావతి రెడ్డి మరింత ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు బొక్క వీరారెడ్డి, సామ పెద్ద వెంకటరెడ్డి, దోసపాటి చిరంజీవి, బొడ్డు నర్సయ్య, రాపర్తి కాటంరాజు, ఎం.డి. ఫరీద్, వార్డ్ సభ్యురాలు అనంతుల భద్రమ్మ, ఇటుకల సతీష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top