
జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గా వల్లూరు కృష్ణారెడ్డి,అజయ్ బాబు
ప్రోగ్రెసివ్ రికగ్నైజడ్ టీచర్స్ యూనియన్ జిల్లా కౌన్సిల్ సమావేశం డా: జి విజయ్ కుమార్ మెమోరియల్ నెల్లూరు హాస్పిటల్ నందు యూనియన్ జిల్లా అధ్యక్షులువల్లూరు కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి. శ్రీనివాసులు రెడ్డి విచ్చేశారు తాను కూడా కలువాయి మండలంలో ఉపాధ్యాయునిగా పనిచేశానని ఉపాధ్యాయులు పాత్ర సమాజ నిర్మాణంలో ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను కేవలం బోధనకు పరిమితం చేయాలని ఇతర ఏ పనులు ప్రభుత్వాలు అప్పగించకూడదని చెప్పారు. ఉపాధ్యాయుడు అంటే క్రమశిక్షణకు మారుపేరని అందుకే వారిని ముగ్గురు దేవతల కంటే అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే మిన్నగా భారత సమాజం గుర్తిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గా వల్లూరు క్రిష్ణ రెడ్డి నిప్రధాన కార్యదర్శి గా సి హెచ్ అజయ్ బాబును ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కౌన్సిల్ సమావేశనికి ఎన్నికల అధికారిగా వై ఎస్ ఆర్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి మోపూరి వెంకట శివారెడ్డివ్యవహారించారు, ఎన్నికల పరిశీలకులు గా రాష్ట్ర సిపిఎస్ కన్వీనర్ గుజ్జల తిరుపాల్ గా వ్యవహారించారు.
